Recruitment Details:
అమెజాన్ కంపెనీలో జాబ్స్ చెయ్యాలి అనుకునేవారికి ఒక మంచి రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వర్చ్యువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా సంబంధిత విభాగాల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగులు అప్లై చేసుకొని వెంటనే online టెస్ట్ రాసే విధంగా ఈ ఉద్యోగాలను విడుదల చెయ్యడం జరిగింది. ఆన్లైన్ రాత పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి వెంటనే ఇంటర్వ్యూ నిర్వహించి వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇస్తారు.
వర్చ్యువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటిగా 6 నుండి 8 వారాలు పాటు ట్రైనింగ్ ఇస్తారు.. ఈ శిక్షణా సమయంలో మీరు ఈ జాబ్స్ ఎలా చెయ్యాలి, ఎటువంటి వర్క్ ఉంటుంది అనే అంశాలపైన పూర్తిగా ట్రైనింగ్ లో మీకు నేర్పిస్తారు. మీరు వర్క్ చెయ్యడానికి అమెజాన్ కంపెనీవారే మీకు ఫ్రీగా లాప్టాప్, ఫ్రీగా WiFi ఫెసిలిటీ కూడా మీకు కల్పిచడం జరుగుతుంది.
ఆన్లైన్ టెస్ట్ లో మీకు ఆంగ్ల భాషకు సంబందించిన ప్రశ్నలు వస్తాయి. మొత్తం 4 నుండి 5 సెక్షన్స్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెడతారు. మీరు ఇప్పుడే లాప్టాప్ / పర్సనల్ కంప్యూటర్ లో అప్లికేషన్ పెట్టుకొని వెంటనే ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. హెడఫోన్, మైక్ కలిగి ఉండాలి.
వయస్సు, ఇతర వివరాలు:
అమెజాన్ నుండి విడుదలయిన ఈ VCSA ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 సంవత్సరాల వయస్సు కలిగి ఇండియాలో వర్క్ చేయడానికి అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లీష్ లో మంచిగా మాట్లాడుతూ కస్టమర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వారానికి 5 రోజులు వర్క్ ఉంటుంది. 2 రోజులు మీకు సెలవు ఇస్తారు. బిజినెస్ అవసరాలను బట్టి over time లో పని చెయ్యాలి. మీరు ఎక్సట్రాగా వర్క్ చేసినందుకుగానూ మీకు over time అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ట్రైనింగ్ తో కూడా కలిపి ₹4.2LPA శాలరీ ఇస్తారు. నైట్ షిఫ్ట్ లో పని చేసినందుకు షిఫ్ట్ అలవెన్సెస్, Overtime వర్క్ చేస్తే overtime అలవెన్సెస్ ఇస్తారు. ఫ్రీగా Laptop, WiFi సదుపాయం కల్పించడం జరుగుతుంది.
అప్లికేషన్, పరీక్ష విధానం :
అమెజాన్ కంపెనీ ఆఫీసియల్ వెబ్సైటులోనే మీరు apply చేసి, వెంటనే ఆన్లైన్ టెస్ట్ రాయాలి.మీరు ఈ exam పూర్తి చెయ్యడానికి మీకు 48 గంటలు సమయం ఇస్తారు. కావున త్వరగా apply చేసి వెంటనే ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి మీకు 3 గంటల వరకు సమయం పడుతుంది.
పరీక్షలో అడిగే ప్రశ్నలు:
ఇంగ్లీష్ భాషపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ భాషపై మీకు ఎంత పట్టు ఉందొ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ పెడతారు. అందులో అర్హత సాధించినవారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తారు. కావున 10+2 అర్హత ఉన్నవారు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి
1 thought on “అమెజాన్ లో పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ | Amazon Work From Home Jobs 2024”