AP Civil Supplies Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ షాప్స్ పని చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 10,500 డీలర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు. దీనికి సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబందించి వచ్చిన సమాచారం ప్రకారం, రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ సజావుగా సాగెందుకుగానూ చౌక దుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 29,000+ దుకాణాలకు అదనంగా మరో 4000 దుకాణాలు ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 6,500 రేషన్ షాపుల్లో డీలర్ల నియామకానికి ప్రభుత్వం ఖసరత్తు చేస్తుంది. ఖాళీగా ఉన్న 6,500 డీలర్ పోస్టులకు అదనంగా మరో కొత్త ఏర్పాటు చేయబోయే 4,000 దుకాణాల్లో మరో 4,000 డీలర్ పోస్టులు కలిపి మొత్తంగా 10,500 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
కావాల్సిన అర్హతలు:
రేషన్ డీలర్ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఆ అభ్యర్థికి కనీసం 10వ తరగతి అర్హత ఉండాలి.
జీతం వివరాలు:
రేషన్ డీలర్ గా ఎంపిక అయిన అభ్యర్థికి నెలకు ₹10,000/- జీతం చెల్లిస్తారు. ఎటువంటి అలవెన్స్, బోనస్ లు ఉండవు.
ఎండియూలతో ఉపయోగం లేదని ప్రభుత్వం ఆలోచన:
గత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లతో (MDU) ఉపయోగం లేదని, ప్రజలు వాటివల్ల ఇబ్బందులు పడ్డారని, దీనివల్ల చౌక దుకాణాల వ్యవస్థ నాశనం అయ్యిందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. కావున రేషన్ కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం చూస్తుంది.
Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : డిప్లొమా / డిగ్రీ అర్హత
పోస్టల్ GDS AP, TS రిజల్ట్స్ విడుదల
సెలక్షన్ ప్రాసెస్ :
రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఈ ఉద్యోగాలకు కనీసం ₹100/- ఫీజు తీసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ వారు ఈ 10,500 డీలర్ పోస్టుల నోటిఫికేషన్ ను ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే విడుదల చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైటుని ప్రతిరోజు సందర్శించండి.
గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలవల్ల ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందులు ఎదురకొంటున్న నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరగా ప్రారభించి పూర్తి చెయ్యాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రక్రియ, ఇతర పూర్తి వివరాలతో కూడిన ఆఫీసియల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ డీలర్ ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. AP DSC నోటిఫికేషన్ కి పర్మిషన్ ఇచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి 19,000 కానిస్టేబుల్, SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని AP హోం శాఖ మంత్రి అనిత అన్నారు.
ఇలాంటి విద్య, ఉద్యోగ వార్తల సమాచారం కోసం మా వెబ్సైటు freshjobsindia ని సందర్శించండి.
1 thought on “AP రేషన్ షాపుల్లో 10,500 డీలర్ పోస్టులు భర్తీ | AP Civil Supplies Dept Notification 2024 | Freshjobsindia”