Fireman Jobs Notification 2024:
భారతదేశంలోని అర్హత కలిగిన పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్/ఫైర్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి విడుదలకావడం జరిగింది. మొత్తం 1130 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ ఉద్యోగాల ప్రకటన పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోండి.
అర్హతలు, వయో పరిమితి:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సైన్స్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవలెను. అలాగే 30/09/2024 నాటికీ 18 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులక్య అర్హత ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
Tech Mahindra లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ తేదీలు:
₹100/- దరఖాస్తు ఫీజు ఆన్లైన్ లో చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి. SC, ST, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 31/08/2024 నుండి 30/09/2024 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లోని తప్పులు సరిచేసుకోవడానికి అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు సమయం కల్పిస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేసే విధానం:
సెలక్షన్ విధానం ఈ క్రింద విధంగా ఉంటుంది.
1.ఫిసికల్ ఈవెంట్స్, 2. డాక్యుమెంట్ వెరిఫికేషన్, 3.రాత పరీక్ష, 4. మెడికల్ టెస్ట్
• అభ్యర్థుల ఎత్తు : 170cm ఉండాలి, చెస్ట్ : 80-85cms ఉండాలి.
• మొదటగా ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. 5km రన్నింగ్ ని 24 నిముషాల్లో పూర్తి చెయ్యాలి. తర్వాత ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ లో అభ్యర్థి హైట్, చెస్ట్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
• ఫిసికల్ ఈవెంట్స్ లో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెయ్యడానికి ఆహ్వానిస్తారు.
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది.
• రాత పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులకు పెడతారు. 120 నిముషాలు సమయం కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్, అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నల చొప్పున ప్రతి టాపిక్ నుండి ప్రశ్నలు వస్తాయి.
• ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే పరీక్ష ఉంటుంది. తెలుగులో ఉండదు.
• రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు కేటగిరీలవారీగా:
UR/EWS/ESM : 35%, SC, ST, OBC: 33%.
అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
CISF ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు 2 విధాలుగా దరఖాస్తు చేసుకోవాలి. 1). వన్ టైం రిజిస్ట్రేషన్ 2). ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడం.
శాలరీ ఎంత ఉంటుంది:
కేంద్ర ప్రభుత్వ Rules ప్రకారం 7th CPC అమలు చేసి నెలకి ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి. TA, DA, HRA, వంటి అన్ని రకాల బెనిఫిట్స్ పొందవచ్చు.
సిలబస్ వివరాలు:
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి విడుదలయిన కానిస్టేబుల్ / ఫైర్ మ్యాన్ ఉద్యోగాల సిలబస్ పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. అన్ని అంశాల సిలబస్ ఉన్నది.
రాత పరీక్ష కేంద్రాలు:
అభ్యర్థులు ఎంపిక చేసుకున్న రాష్ట్రం, జిల్లాలోనే వారికి రాత పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం లేదు. కావున అభ్యర్థులు ముందుగానే వారికి దగ్గరగా ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ యూనిఫామ్ జాబ్స్ సమాచారం కోసం మా వెబ్సైటుని వీక్షించండి.
I want to do this job
This is very important to me