IBPS PO & SO Jobs Notification 2024:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిస్) నుండి 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్, 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులతో అధికారికంగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. మొత్తం 5,350 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
4,455 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల అర్హతలు, వయస్సు వివరాలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగి 21.08.2024 నాటికీ డిగ్రీ ఫలితాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఖరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
TATA లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇస్తారు: అప్లై
20 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగి 02.08.1994 నుండి 01.08.2024 మధ్య పుట్టినవారు అర్హులు. కేంద్ర ప్రభుత్వ నియమం ప్రకారం SC, ST, ex-servicemen అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 5 సంవత్సరాల వయా సడలింపు కల్పిస్తున్నారు.
896 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హతలు, వయస్సు వివరాలు:
ఐబిపిస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల వారీగా అర్హతలు ఇలా ఉన్నాయి
• ఐటీ ఆఫీసర్ (స్కేల్ 1): ఇంజనీరింగ్ లోనే పలు విభాగాల్లో 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 20-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
• అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ( స్కేల్ 1): వ్యవసాయం, డైరీ, ఫిషరీస్ సంబందించిన పలు విభాగాల్లో 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు : 20-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
• రాజభాష అధికారి (స్కేల్ 1) : పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో హిందీతో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కలిగినవారు అర్హులు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో సంస్కృతంతో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కలిగినవారు అర్హులు. 20-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
TGPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు విడుదల
• లా ఆఫీసర్ (స్కేల్ 1) : లా (LLB) లో డిగ్రీ చేసి బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా నమోదు చేసుకున్నవారు అర్హులు.-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
• HR లేదా పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ 1): డిగ్రీతో పాటు 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పర్సనల్ మానేజ్మెంట్ / HR/ HRD/సోషల్ వర్క్ / లేబర్ లా చేసినవారు అర్హులు. 20-30 సంవత్సరాల వయస్సు ఉండాలి.
• మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్ 1): డిగ్రీతో 2 సంవత్సరాల ఫుల్ టైం MMS (మార్కెటింగ్ ) లేదా 2 సంవత్సరాల ఎంబీఏ చేసినవారు అర్హులు. 20-30 సంవత్సరాల వయస్సు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
UR/ఓబీసీ /EWS అభ్యర్థులు ₹850/- పరీక్ష ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ₹175/- పరీక్ష ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
మొదటిగా ఆన్లైన్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ నుండి 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 60 నిముషాలు సమయం ఇస్తారు. 0.25 మార్క్స్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి.
ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు తీసుకొని 155 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను 200 మార్కులకు నిర్వహిస్తారు. 3 గంటల సమయం ఉంటుంది. వెంటనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ 25 మార్కులకు నిర్వహిస్తారు. 30 నిముషాలు సమయం ఉంటుంది.
మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్ గా, స్పెషలిస్ట్ ఆఫీసర్ గా ఐబీపీస్ బ్యాంకుల్లో జాబ్స్ ఇస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
ప్రొబేషనరీ ఆఫీసర్ గా లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా 2 సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో ₹25,000/- జీతం చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నెలకు ₹47,000/- వరకు జీతం చెల్లిస్తారు.
ఏ విధంగా అప్లై చేయాలి, ఆఖరి తేదీ?:
ఐబీపీస్ ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వేర్వేరుగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు 2 రకాల ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఆఖరు తేదీని ఆగష్టు 28వ తేదీ వరకు పొడిగించారు. కావున ఆ సమయంలోగా ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకొని సబ్మిట్ చెయ్యండి.
సెంట్రల్ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి.
1 thought on “5,350 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ | IBPS PO & SO Jobs Notification 2024 | Freshjobsindia”