గ్రామీణ సబ్ స్టేషన్స్ లో 952 పోస్టులతో నోటిఫికేషన్ | PGCIL Notification 2024 | Freshjobsindia

PGCIL Notification 2024:

భారతదేశంలోని ప్రభుత్వ సంస్థల్లో ఒకటైనటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL విద్యుత్ సంస్థ నుండి 952 పోస్టులతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ అసిస్టెంట్ద్యో ట్రైనీ గాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 3 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల ఇంటర్ + CA, CMA, B. Com చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22nd అక్టోబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్ చేసే ఆఖరు తేదీ : 12th నవంబర్ 2024

రాత పరీక్ష నిర్వహించే తేదీ : జనవరి లేదా ఫిబ్రవరి 2025.

Join WhatsApp Group

ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 952 పోస్టులతో నోటిఫికేషన్ ట్రైనీ ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, ఇంటర్ + CA, CMA, B. Com లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT test), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష 2 గంటలు ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు వస్తాయి.1/4వ వంతు నెగటివ్ మార్కులు కూడా వస్తాయి.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

SC, ST అభ్యర్థులకు : 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది., PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

Pgcil ఉద్యోగాలకు సెలక్షన్ అయిన అభ్యర్థులకు మొదటగా ఒక సంవత్సరం కాలంపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹40,000/- స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు ₹90,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి. TA, DA, HRA కూడా ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో apply చేసుకునే అభ్యర్థులు కొన్ని పోస్టులకు ₹300/- ఫీజు, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ₹200/- ఫీజు చెల్లించాలి.

SC, ST, PWD, EX సర్వీసెమెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

ఆన్లైన్ అప్లికేషన్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature కలిగి ఉండాలి.

10త్త, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు మీకు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం తెలుసుకొని ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకోగలరు.

Notification PDF

Apply Online

PGCIL విద్యుత్ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

1 thought on “గ్రామీణ సబ్ స్టేషన్స్ లో 952 పోస్టులతో నోటిఫికేషన్ | PGCIL Notification 2024 | Freshjobsindia”

Leave a Comment