పోస్టల్ GDS 44,228 ఉద్యోగాల ఫలితాలు విడుదల | Postal GDS Results 2024 In Telugu

Postal GDS 2024 Results Released:

ఇటీవల తపాలా శాఖ నుండి విడుదలచేసిన 44,228 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబందించిన ఫలితాలను పోస్టల్ శాఖ అధికారికంగా ఈరోజు మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఈరోజు 12 పోస్టల్ సర్కిల్స్ కి సంబందించిన ఫలితాలు విడుదలకావడం జరిగింది. మిగిలిన ఫలితాలు మరికొద్ది రోజుల్లో అధికారిక పోస్టల్ వెబ్సైటులో పొందుపరచడం జరుగుతుంది. కావున ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ సర్కిల్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను వెంటనే అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు సెలెక్ట్ అయ్యారా? లేదా అనేది చూసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మొత్తం ఎన్ని పోస్టులు:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా పోస్టల్ సర్కిల్స్ కింద తపాలాశాఖవారు 2,336 పోస్టులను విడుదల చెయ్యడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కింద 1355 GDS పోస్టులు, తెలంగాణా సర్కిల్ కింద 981 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి అంటే అ అభ్యర్థికి కనీసం 10వ తరగతి అర్హతతో పాటు 18-40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అలాగే ఆ అభ్యర్థి అప్లై చేసే సర్కిల్మ్ / రాష్ట్రానికి సంబందించిన భాషని వారి 10వ తరగతిలో ఒక సబ్జెక్టుగా కలిగి ఉంటేనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:

తపాలా శాఖ నుండి విడుదల చేసిన 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారికి 10వ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ని తయారు చేసి ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు : 10+2 అర్హత

కట్ ఆఫ్ మార్క్స్ వివరాలు:

ఈరోజు విడుదల చేసిన పోస్టల్ GDS ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు 10వ తరగతిలో 100% మార్క్స్ వచ్చినవారికే ఈ ఉద్యోగాలు వచ్చాయి, తెలంగాణా అభ్యర్థులకు 97%, 98%, 99%, 100% మార్క్స్ వచ్చినవారు సెలెక్ట్ కావడం జరిగింది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు?:

గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా వారికి సంబందించిన 10th మార్క్స్ లిస్ట్, కుల ధ్రువీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్స్ ని ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో సంబంధిత పోస్టల్ ఆఫీస్ నందు వెరిఫికేషన్ చేయించుకొని 2 కాపీలను పోస్టల్ శాఖవారికి సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది.

GDS లకు జీతం ఎలా ఉంటుంది?:

పోస్టల్ GDS ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి మొదటగా 3 రోజులు ట్రైనింగ్ ఇస్తారు.తరువాత నెలకు BPM ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి అన్ని అలవెన్సెస్ తో కలిపి నెలకు ₹18,500/- వరకు జీతం వస్తుంది. ABPM లుగా ఎంపిక ఆయినవారికి నెలకు ₹14,500/- జీతం వస్తుంది. మొదటి సంవత్సరంలో ఇచ్చే ఈ జీతాలను Level 1 జీతాలుగా పరిగణిస్తారు.

ప్రమోషన్స్ ఎలా ఉంటాయి?:

డాక్ సేవక్ లుగా ఎంపిక అయినవారికి మొదటి 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిన తర్వాత పోస్టల్ శాఖ వారు డిపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించి MTS లుగా ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది.

ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

44,228 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల ఫలితాలను అధికారిక వెబ్సైటు (https://indiapostgdsonline.gov.in/) నందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సర్కిల్స్ మొదటి మెరిట్ లిస్ట్ PDFs ని download చేసుకొని మీ పేరు ఉందేమో చూసుకోవచ్చు.

• ఆంధ్రప్రదేశ్ ఫలితాలు : డౌన్లోడ్ PDF

• తెలంగాణా ఫలితాలు : డౌన్లోడ్ PDF

అధికారిక పోస్టల్ వెబ్సైటు : Click Here

4 thoughts on “పోస్టల్ GDS 44,228 ఉద్యోగాల ఫలితాలు విడుదల | Postal GDS Results 2024 In Telugu”

Leave a Comment