Railway NTPC Notification 2024:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి త్వరలో ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు 11,000 పోస్టులతో రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC) నోటిఫికేషన్ విడుదలకాబోతోంది. 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 36 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, టైపింగ్ టెస్ట్, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి మంచి ఉత్తీర్ణత కలిగిన వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఈ ప్రకటన అర్హతలు వయస్సు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ 10+2 స్థాయి పోస్టుల వివరాలు:
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 361 పోస్టులు
టికెట్ క్లర్క్ : 1985 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 990 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్ : 68 పోస్టులు
మొత్తం పోస్టులు : 3,404
SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ డిగ్రీ స్థాయి పోస్టుల వివరాలు:
గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ : 2,684 పోస్టులు
స్టేషన్ మాస్టర్ : 963 పోస్టులు
చీఫ్ కమ్ టికెట్ సూపర్వైసర్ : 1737 పోస్టులు
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 1371 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 725 పోస్టులు
మొత్తం పోస్టులు : 7,479 పోస్టులు
10+2, డిగ్రీ అర్హతతో ఉన్న మొత్తం పోస్టులు : 10,884 పోస్టులు
కావాల్సిన అర్హతలు, వయస్సు వివరాలు:
రైల్వే NTPC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 10+2 అర్హత లేదా డిగ్రీ అర్హత కలిగిన పురుషులు, స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుండి 36 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకి 5 సంవత్సరాలు, OBC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
రాత పరీక్ష విధానం:
మొదటగా ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు 120 నిముషాలు సమయం కేటాయించి 90 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు భాషలోనే రాత పరీక్ష ఉంటుంది.ప్రిలిమ్స్ లో అర్హత పొందిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావలెను. ఆ పరీక్షలో 120 ప్రశ్నలు ఇచ్చి 90 నిముషాలు సమయం కేటాయిస్తారు. 120 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ప్రిలిమ్స్, మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ పరీక్ష ఉంటుంది. ఇలా అన్ని రౌండ్స్ లో అర్హత పొందినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులు ఎంచుకున్న రైల్వే జోన్ పరిధిలో పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
7th CPC ప్రకారం శాలరీస్ ఉంటాయి. పోస్టులను అనుసరించి కనీసం ₹35,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. శాలరీతో పాటు ఉండటానికి ఇళ్లు, TA, DA, HRA వంటి చాలా బెనిఫిట్స్ కల్పిస్తారు.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
రైల్వే NTPC ( నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) ఉద్యోగాల నోటిఫికేషన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రైల్వే శాఖవారు ఖాళీలతో ఉన్న నోటీసు విడుదల చెయ్యడం జరిగింది.
రైల్వే, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలస్ సమాచారం కొరకు Freshjobsindia వెబ్సైటు ని visit చెయ్యండి. మీకు ఉపయోగపడే ఉద్యోగాల సమాచారం అంధుచడం జరుగుతుంది.
2 thoughts on “రైల్వే NTPC 11,000 పోస్టులతో నోటీస్ విడుదల | Railway NTPC Notification 2024 | Freejobsintelugu”