ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ WFH జాబ్స్ ఇస్తారు | Recruit CRM Work From Home Jobs 2024 | Freshjobsindia

Recruit CRM Recruitment 2024:

కొత్తగా స్థాపించిన ప్రైవేట్ స్టార్ట్ అప్ కంపెనీలలో ఒకటైనటువంటి Recruit CRM సంస్థ నుండి 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల చేశారు. 2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకునే BE / B. Tech / BCA / B.Sc. / MTech / MCA /M.Sc కంప్యూటర్స్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ లో మంచి స్టైపెండ్ తో పాటు recruit crm సంస్థలో పర్మినెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు. ఈ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

శిక్షణ కాలపరిమితి, స్టైపెండ్, శాలరీ వివరాలు:

Recruit CRM సంస్థవారు నిర్వహించిన ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలలో అర్హత పొందినవారికి మొదటగా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.

1100+ పోస్టులతో భారీగా ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు

3 నెలలు ట్రైనింగ్ లో నెలకు : ₹7,500/- స్టైపెండ్ ఉంటుంది. తర్వాత మిగిలిన

6 నెలలు ట్రైనింగ్ లో నెలకు : ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు.

మొత్తం ఈ 9 నెలలు ట్రైనింగ్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు Recruit CRM సంస్థలో ₹7LPA శాలరీతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ ఇస్తారు.

ఉండవలసిన అర్హతలు:

సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన సంస్థ నుండి BE, BTECH, ME, MTECH, MCA, MSC(కంప్యూటర్స్) లో 2025 లో పూర్తి చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు.

సెలక్షన్ ప్రాసెస్:

• ఆన్లైన్ రాత పరీక్ష • టెక్నికల్ రౌండ్ • స్కిల్ ఆధారితే రాత పరీక్ష • ఆన్లైన్ కోడింగ్ ఆధారిత పరీక్ష • టెక్నికల్ ఇంటర్వ్యూ • ఫైనల్ ఇంటర్వ్యూ. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా అర్హులను క్రొడీకరించి రిక్రూట్మెంట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇంటి నుండి పని చేసే ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు దేశంలో ఎక్కడనుందైనా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇంటినుండి పని చేసే ఉద్యోగాలు ఇవి.

Tech Mahindra లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : 10+2 అర్హత

రాత పరీక్షకు కావాల్సిన పరికరాలు:

• రాత పరీక్షఈ సొంత కంప్యూటర్ లేదా లాప్టాప్ లోనే రాయాల్సి ఉంటుంది. మంచి ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండాలి.

• మీ కంప్యూటర్ లేదా లాప్టాప్ కి వెబ్ కామ్ కచ్చితంగా పని చెయ్యాలి.

• అన్ని పరీక్షలకు తప్పకుండా అభ్యర్థులు హాజరుకావలెను. ఒక నెల రోజుల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తారు.

చేయవలసిన వర్క్ ఎలా ఉంటుంది:

సాఫ్ట్వేర్ డెవలపర్స్ తో పని చేస్తూ, డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవాలి.

సాఫ్ట్వేర్ కోడింగ్ రాయడం, డికోడింగ్, డిబుగ్గింగ్, ట్రబల్ షూటింగ్ వంటి అంశాలపై వర్క్ చెయ్యాలి.

Java, PHP, Phython వంటి స్కిల్స్ ఉన్నవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడాలి, క్లయింట్ కి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

ఎలా అప్లై చెయ్యాలి, దరఖాస్తు ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ లాప్టాప్, కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లలో ఈ ఉద్యోగాలము దరఖాస్తు చేసుకోవచ్చు.

మొదటగా ట్రైనింగ్ కూడా ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే ఉంటుంది. మీరు వర్క్ చెయ్యడానికి Recruit CRM సంస్థవారు మీకు ఉచితంగా లాప్టాప్, ఫ్రీ WiFi సౌకర్యం కల్పిస్తారు.

Apply Online

ఇంటినుండి పని చేసే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్ సైట్ ని ప్రతి రోజూ సందర్శించండి.

2 thoughts on “ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ WFH జాబ్స్ ఇస్తారు | Recruit CRM Work From Home Jobs 2024 | Freshjobsindia”

Leave a Comment