TATA Recruitment 2024:
దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థలలో ఒకటైంటువంటి TATA STEEL నుండి అన్ని రాష్ట్రాలవారు Apply చేసుకునే విధంగా Aspires Engineers Program 2024 రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. ఎంపిక అయిన అభ్యర్థులకు 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ₹7LPA ఉన్నటువంటి ఉద్యోగాలు ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించినవారిని మొదటగా 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గా పర్మినెంట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చెయ్యడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
TGPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు విడుదల
ఎవరు అర్హులు:
డిగ్రీలో BE/B.TECH/Bsc(Engg) పూర్తి చేసినవారైనా లేదా ఆఖరి సంవత్సరం చధువుతున్నవారైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ క్రింద తెలిపిన విభాగాల్లో డిగ్రీ వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్
- మెకానికల్
- మెటలర్జి
- మినరల్
- మైనింగ్
- ప్రొడక్షన్ ఇంజనీరింగ్
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
- మెకట్రానిక్స్
(లేదా) MTECH, MSC పూర్తి చేసిన వారైనా / ఆఖరి సంవత్సరంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రింద తెలిపిన డిగ్రీల్లో PG చేసినవారికి అవకాశం కల్పిస్తారు.
- జియోలజీ
- జియో ఫిజిక్స్
- రిమోట్ సెన్సింగ్
- జియో ఇన్ఫర్మేటిక్స్
డిగ్రీ / PG లో 6.5CGPA లేదా 65% మార్క్స్ కలిగినవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.SC, ST, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు 6.0 CGPA లేదా 60% మార్క్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో ఒడిశా / ఝార్ఖండ్ అభ్యర్థులకు ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తారు.
TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్
వయస్సు, శాలరీ వివరాలు:
TATA AEP ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు గరిష్టంగా 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.SC, ST ట్రాన్స్ జెండర్, PWD అభ్యర్థులకు 32 సంవత్సరాల వయస్సు ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎంపిక అయినవారికి మొదటగా 12 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 30,000/- స్టైపెండ్ ఉంటుంది.ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ₹7LPA శాలరీ ఆఫర్ చేస్తారు. అలాగే Medi – Claim పధకం కింద Hospitalization Coverage ₹2,50,000/- మరియు ఆక్సిడెంటల్ కవరేజ్ కింద ₹6,000/- ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
TATA స్టీల్ ASE 2024 రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఫంక్షనల్ డోమైన్ టెస్ట్ పెడతారు. అందులో అర్హులైనవారికి ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు ఎంపికైనవారిని TATA స్టీల్ సంస్థ తమ కంపెనీ ఆఫీసియల్ మెయిల్ ID career@tatasteel.com నుండి మాత్రమే సంప్రదించడం జరుగుతుంది.వేరే ఇతర ఏ మెయిల్స్ నుండి వచ్చిన అవి ఆఫీసియల్ కాదు. Tata స్టీల్ సంస్థ ఈ రిక్రూట్మెంట్ చెయ్యడానికి అభ్యర్థుల నుండి ఎటువంటి డబ్బులు వసూల్ చేయదు. కావున అభ్యర్థులు వేరే మెయిల్స్ నుండి వచ్చే Fake సమాచారాన్నియ్ నమ్మవద్దు.
అప్లికేషన్ ఆఖరు తేదీ:
04.09.2024 లోగా అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇతర వేరే విధంగా అప్లికేషన్ పెట్టుకున్నా అంగీకరించబడదు.
ఎలా అప్లై చెయ్యాలి?:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్ లింక్స్ ద్వారా మీ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి. నిర్నీత సమయంలోగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది
TATA Steel వంటి సంస్థల నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా Freshjobsindia వెబ్సైట్ ని ప్రతి రోజూ సందర్శించండి.
1 thought on “TATA చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ | TATA Steel ASE Program 2024 | Freshjobsindia”