TCS BPS Hiring 2024:
Tata Consultancy Services (TCS) నుండి 2025 లో డిగ్రీ పూర్తి చేసుకునే అభ్యర్థులకోసం BPS Hiring 2025 ను అధికారికంగా విడుదల చేశారు. డిగ్రీలో B. Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc (Except మాథ్స్ , ఫిజిక్స్ , స్టాటిస్టిక్స్ , కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) – 2025 లో డిగ్రీ పూర్తి చేసుకునేవారు Apply చేసుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న కాండిడేట్స్ కి TCS ION డిజిటల్ సెంటర్స్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు
Backlogs, స్టడీ గ్యాప్:
ఒక బ్యాక్ లాగ్ ఉన్నాకూడా TCS సెలక్షన్ ప్రాసెస్ కి అనుమతిస్తారు. జాబ్ సెలెక్ట్ అయినట్లయితే ఆ ఒక్క బ్యాక్ లాగ్ సబ్జెక్టు పాస్ అయ్యి ఉంటేనే జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. బ్యాక్ లాగ్ క్లియర్ చెయ్యని పక్షంలో మీకు ఉద్యోగం ఇవ్వడం జరగదు. అలాగే మీకు 2 సంవత్సరాలు లేదా 24 నెలలు మీ అకాడమిక్ కెరీర్ లో గ్యాప్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ కల్పిస్తారు.
AP రేషన్ షాప్స్ లో 10,500 రేషన్ డీలర్స్ ఉద్యోగాలు
ఏ కోర్స్ చేసినవారు అర్హులు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ లో ఫుల్ టైం డిగ్రీ చేసినవారు మాత్రమే అర్హులు. కరెస్పాండెన్స్ కోర్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినవాళ్లు అర్హులు కాదు.
ఎంత వయస్సు ఉండాలి:
ఇవి ఎంట్రీ లేవల్ జాబ్స్ అయినందున 18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉన్నవారు Apply చేసుకోవచ్చు.
అప్లికేషన్స్ చేసుకునే విధానం:
స్టెప్ 1: TCS Next step పోర్టల్ లో మీరు BPS ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
స్టెప్ 2: మీ ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసి అప్లికేషన్ పూర్తి చెయ్యాలి
స్టెప్ 3: ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు డైరెక్ట్ గా లాగ్ ఇన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవాలి. మొదటిసారి apply చేస్తున్న అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తరువాత అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి.
స్టెప్ 4: అప్లికేషన్ విజయవంతంగా పూర్తి చేసినవారు TCS Next Step పోర్టల్ లోనే మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు.
స్టెప్ 5: Apply చేసుకున్న అభ్యర్థులకు 11th అక్టోబర్ న ఆన్లైన్ టెస్ట్ పెడతారు. ఆన్లైన్ టెస్ట్ రాయడానికి మీకు Admit cards డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
Wipro లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్
పరీక్ష విధానం:
50 నిముషాల ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అందులో వెర్బల్ ఎబిలిటీ, రీసనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీటివ్ అప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
అప్లికేషన్ ఆఖరు తేదీ:
సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం ఉంది. అప్లికేషన్ పెట్టుకున్నవారికి అక్టోబర్ 11వ తేదీన ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.
TCS నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలన్నీ కూడా ఫుల్ టైం ఉద్యోగాలు. నెలకు ₹30,000/- వరకు జీతం ఉంటుంది. TCS Next Step Portal లో BPS అనే option సెలక్షన్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.
ఎలా Apply చెయ్యాలి?:
ఈ క్రింద ఉన్న Official Apply లింక్స్ ఆధారంగా అప్లికేషన్ పెట్టుకోవాలి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం Freshjobsindia వెబ్సైటుని సందర్శించండి.
2 thoughts on “TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్న జాబ్స్ | TCS BPS Hiring 2024 | Freshjobsindia”