TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు విడుదల చేశారు | TGPSC Group 2 Exam Dates 2024 | Freshjobsindia

TGPSC Group 2 Exam Dates 2024:

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా 2022 డిసెంబర్ 29న విడుదల చేసిన TGPSC గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC అధికారికంగా విడుదల చెయ్యడం జరిగింది. మొత్తం 783 పోస్టులతో విడుదలయిన గ్రూప్ 2 ఉద్యోగాలకు 5 లక్షల మంది వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 4 పేపర్లకు సంబందించిన పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

TGPSC గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్:

పేపర్ / సబ్జెక్టుపరీక్ష తేదీ
పేపర్ 1 (GS & GA) 15/12/2024 (10AM – 12.30PM)
పేపర్ 2 (హిస్టరీ, పాలిటి, సొసైటీ)15/12/2024 (3PM – 5.30PM)
పేపర్ 3 (ఎకానమీ & డెవలప్మెంట్) 16/12/2024 (10AM – 12.30 PM)
పేపర్ 4 ( తెలంగాణా ఉద్యమం, రాష్ట్ర అవతరణ) 16/12/2024 (3PM – 5.30 PM)
హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి?:

Tgpsc గ్రూప్ 2 పోస్టులకు apply చేసినవారు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Tgpsc వెబ్సైటులో అడ్మిట్ కార్డు లింక్ ఆక్టివేట్ అయిన తరువాత మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.

TCS లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్

మొత్తం ఎన్ని పోస్టులు:

783 పోస్టులకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 2022 డిసెంబర్ 29 న నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. తెలంగాణాలో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 స్థాయి పోస్టుల రిక్రూట్మెంట్ చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్:

గ్రూప్ 2 లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కటే రాత పరీక్ష ద్వారా గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న పోస్టుల ఆధారంగా జాబ్ పోస్టింగ్ ఇస్తారు. గ్రూప్ 2 లో మున్సిపల్ కమీషనర్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిప్యూటీ మండల్ రెవిన్యూ ఆఫీసర్ వంటి పలు రకాల పోస్టులు ఉంటాయి.

ఏపీలో 10,500 రేషన్ డీలర్స్ నోటిఫికేషన్

అర్హతలు, వయస్సు వివరాలు:

తెలంగాణా గ్రూప్ 2 ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే.

ఎంత జీతం ఉంటుంది:

గ్రూప్ 2 ఉద్యోగాలకు పే స్కేల్ ప్రకారం అన్ని అలవెన్సులు కలుపుకొని ₹50,000/- వరకు జీతాలు ఉంటాయి. దీనితో పాటు ప్రభుత్వం ఉచిత వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తారు.

సిలబస్ వివరాలు:

గ్రూప్ 2 పోస్టులకు నిర్వహించే ఉద్యోగాలకు చాలా రకాల సిలబస్ ని పొందుపరిచారు. జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ గ్రామర్, తెలంగాణా ఉద్యమం, చరిత్ర, తెలంగాణా అవతరణ వంటి పలు అంశాలు ఉన్నాయి.

Download TGPSC Group 2 Exam Schedule

Official website

ప్రతిరోజూ విడుదల చేసే విద్యా ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు freshjobsindia ని సందర్శించండి.

1 thought on “TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు విడుదల చేశారు | TGPSC Group 2 Exam Dates 2024 | Freshjobsindia”

Leave a Comment