TGSRTC లో 3,035 పోస్టులతో నోటిఫికేషన్ | TGSRTC Notification 2024 | Freshjobsindia

TGSRTC Notification 2024:

తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి 3,035 పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర రవాణా సంస్థ అధికారికంగా నోటీసు విడుదల చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తామని తెలంగాణా రవాణా శాఖ మంత్రి ప్రకటన చేశారు. 3,035 పోస్టులలో డిపోట్ మేనేజర్, డ్రైవర్, శ్రామిక్, సెక్షన్ ఆఫీసర్, ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు చూడండి.

పోస్టులవారీగా ఖాళీల వివరాలు:

డిపోట్ మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 15
శ్రామిక్స్ 743
డిప్యూటీ Suptd (ట్రాఫిక్)84
డిప్యూటీ Suptd (మెకానికల్)114
డ్రైవర్ 2,000
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11
అకౌంట్స్ ఆఫీసర్ 06
మెడికల్ ఆఫీసర్స్ (జెనరల్)07
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)07
మొత్తం పోస్టులు 3,035
TGSRTC : Official List

పోస్టుల అర్హతలు, వయస్సు వివరాలు:

పోస్టులవారీగా అర్హతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

డ్రైవర్ : 2,000 పోస్టులు : 10వ తరగతి పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి

శ్రామిక్స్ : 743 పోస్టులు : 10వ తరగతి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగినవారు Apply చేసుకోవాలి

డిప్యూటీ మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ : 25 పోస్టులు : డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 5 నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 18 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉండాలి.

అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్: 15 పోస్టులు : మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి 18 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే apply చేసుకోవాలి.

డిప్యూటీ Suptd(ట్రాఫిక్) : 84 పోస్టులు : 5 నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 50 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.

డిప్యూటీ Suptd(మెకానికల్) : 114 పోస్టులు : 5 నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 50 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 23 పోస్టులు: సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ చేసి 18 నుండి 44 సంవత్సరాల వయస్సు ఉంటే Apply చేసుకోవచ్చు.

సెక్షన్ ఆఫీసర్ (సివిల్) : 11 పోస్టులు: సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ చేసి 18 నుండి 44 సంవత్సరాల వయస్సు ఉంటే Apply చేసుకోవచ్చు.

అకౌంట్స్ ఆఫీసర్ : 06 పోస్టులు : అకౌంట్స్ విభాగంలో BCOM, BA చేసి 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

మెడికల్ ఆఫీసర్ (జనరల్) :07 పోస్టులు : MBBS లో ఉత్తీర్ణత కలిగినవారు 18 నుండి 44 సంవత్సరాల వయస్సు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి.

మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 07 పోస్టులు : MBBS లో ఉత్తీర్ణత కలిగినవారు 18 నుండి 44 సంవత్సరాల వయస్సు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి.

రైల్వే NTPC 11,000 పోస్టులతో నోటిఫికేషన్

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ పూర్తి చేస్తారు.

శాలరీస్ ఎలా ఉంటాయి?:

పోస్టులను అనుసరించి ₹19,000/- నుండి ₹35,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి UR, OBC, EWS అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. మిగిలిన SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.

Flipkart లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు : No Exam

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

TGSRTC వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విభాగంలో దరఖాస్తులు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు.

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:

మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలంగాణా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు..

TGSRTC : Official Vacancy PDF

TGSRTC : Official Website

తెలంగాణా రాష్ట్ర విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.

19 thoughts on “TGSRTC లో 3,035 పోస్టులతో నోటిఫికేషన్ | TGSRTC Notification 2024 | Freshjobsindia”

Leave a Comment