Forest Dept Notification 2024:
భారత అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి 08 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1, టెక్నికల్ అసిస్టెంట్, ఎనలిస్ట్, జూనియర్ ఎనలిస్ట్ పోస్టులను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ప్రాజెక్ట్ లలో ఒక సంవత్సరంపాటు టెంపరరీగా పని చెయ్యాలి. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీల పూర్తి వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్ : 02 పోస్టులు: నేచరల్ లేదా అగ్రికల్చర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి మంచి అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.ఎంపిక ఆయినావారికి ₹31,000+ HRA కూడా ఇస్తారు.
Fresh Prints లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్
ప్రాజెక్ట్ అసోసియేట్ 1: 01 పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్స్ లో నేచరల్ లేదా అగ్రికల్చర్ సైన్స్ చేసినవారు అర్హులు. 18 – 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ₹31,000/- జీతంతోపాటు HRA కూడా చెల్లిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్ : 01 పోస్టు : గుర్తింపు కలిగిన సంస్థ నుండి సైన్స్ లో డిగ్రీ చేసిన లేదా డిప్లొమా చేసిన దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. ₹20,000/- శాలరీతో పాటు HRA కూడా ఇస్తారు.
ఎనలిస్ట్: 02 పోస్టులు : లైఫ్ సైన్స్ లేదా ఫారెన్సిక్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు అర్హులు. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. నెలకు ₹30,000/- జీతం చెల్లిస్తారు.
జూనియర్ ఎనలిస్ట్ : 02 పోస్టులు : BSC లైఫ్ సైన్స్ లేదా ఫారెన్సిక్ సైన్స్ లో పాస్ అయినవారు అప్లై చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ₹25,000/- జీతం చెల్లిస్తారు.
TGSRTC లో 3,035 ఉద్యోగాల నోటిఫికేషన్
కాంట్రాక్ట్ కాలపరిమితి:
ఎంపిక అయిన అభ్యర్థులు ఒక సంవత్సరం కలంపాటు ప్రాజెక్టలలో ఓని చెయ్యాలి. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హత కలిగిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులు కేవలం ₹100/- ఫీజు చెల్లెస్తే చాలు. ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లో ఫీజు రుసుమును డిపాజిట్ చేసి అప్లికేషన్ ఫారంతో పాటు పంపించాలి.
ముఖ్యమైన సూచనలు:
• దరఖాస్తు చేయనుకునే అభ్యర్థులు అప్లికేషన్ లోని అన్ని వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేసి నిర్నీత సమయంలోగా పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
• అప్లికేషన్ ఫారంతో పాటు ఫీజు రిసీట్, అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్స్ అన్ని కలిపి పంపించాలి.
• దరఖాస్తు చేశాక ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఆఖరు తేదీ:
25.08.2024 నుండి 12.09.2024 వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి అప్లికేషన్స్ హార్డ్ కాపీలను పంపించాలి. ఆఖరు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు పూరించి ఇచ్చిన సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలను ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
అటవీ శాఖ నుండి విడుదలయ్యే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కొరకు మా వెబ్సైటుని సందర్శించండి.
Ankamapaill belguppa ananthpur
Ankamapaill