Wipro Recruitment Details:
- Wipro కంపెనీ నుండి మీకు 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాం (WILP), స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానేజ్మెంట్ (SIM) అనే ఈ రెండు రిక్రూట్మెంట్స్ ని విడుదల చెయ్యడం జరిగింది. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, డిగ్రీలో BCA(బాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSC) చేసినవారు Wipro WILP రిక్రూట్మెంట్ కి Apply చెయ్యొచ్చు. అలాగే మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా చేసినవారు Wipro SIM రిక్రూట్మెంట్ కి Apply చెయ్యొచ్చు.
Wipro WILP అర్హత, సెలక్షన్ ప్రాసెస్:
- Wipro WILP ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే 10th, 12th అర్హత కలిగి 60% లేదా 6.0 CGPA మార్కులతో BSC(మాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్), BCA 2023,2024 లో పాస్ అయినవారు Apply చేసుకోవాలి.
- ఫుల్ టైం డిగ్రీ చేసినవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. పార్ట్ టైం, డిస్టెన్స్ లో డిగ్రీ చేసినవారు అప్లై చేసుకోవాలి.
- ఒక బ్యాక్ లాగ్ ఉన్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. 3 సంవత్సరాలు మీకు అకడమిక్ గ్యాప్ ఉన్న అప్లై చేసుకోవచ్చు.
- డిగ్రీలో ఏమైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా అప్లై చెయ్యడానికి అర్హత ఉండదు.
రిక్రూట్మెంట్ ప్రాసెస్ : ఈ ఉద్యోగాలుకు అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా 80 నిముషాల ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అందులో అర్హత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మీకు ప్రీ ట్రైనింగ్ ఇస్తారు. స్కాలర్ ట్రైనీ గా జాబ్ లోకి తీసుకొని 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే ఫుల్ టైం జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
పోస్టల్ GDS 44,228 పోస్టుల ఫలితాలు విడుదల
Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్
Wipro SIM అర్హత, సెలక్షన్ ప్రాసెస్:
- Wipro SIM ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి అంటే 10th, 12th అర్హత కలిగి 50% మార్కులతో డిప్లొమా (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / కంప్యూటర్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) విభాగాల్లో అర్హత కలిగినవారు 2023,2024,2025 లో పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చు.
- ఒక బ్యాక్ లాగ్ కలిగి ఉండి, 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్ గ్యాప్ కలిగినవారు కూడా అప్లై చెయ్యొచ్చు.
- రిక్రూట్మెంట్ ప్రాసెస్ : Wipro SIM ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ముందుగా అప్లై చేసినటువంటి అభ్యర్థులకు 45 నిముషాల ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి తర్వాత గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులను స్కాలర్ ట్రైనీగా తీసుకొని 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం జాబ్స్ ఇస్తారు.
ట్రైనింగ్ లో ఇచ్చే స్టైపెండ్, శాలరీ వివరాలు:
• Wipro WILP, Wipr SIM ఉద్యోగాలకు మొత్తం 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. మొదటి సంవత్సరంలో Join అయినందుకు ₹75,000/- Bonus గా ఇస్తారు. అలాగే నెలకు ₹23,000/- స్టైపెండ్ తో పాటు ESI సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. 4 సంవత్సరాల ట్రైనింగ్ కాలం పూర్తి అయిన తరువాత మీకు ₹6LPA శాలరీ ఆఫర్ చేస్తూ జాబ్ ని పర్మినెంట్ చేస్తారు.
WILP, SIM కి ఎలా అప్లై చెయ్యాలి :
- Join superset వెబ్సైటులో Wipro WILP, SIM ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు. మీ Mail ID తో రిజిస్ట్రేషన్ చేసుకొని, మీ Resume, ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు August 30వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది:
- Wipro WILP, WIPRO SIM ఉద్యోగాలకు కామన్ గా పరీక్ష ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ టాపిక్స్ పై పరీక్ష ఉంటుంది.
2 thoughts on “Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు | Wipro Recruitment 2024”